టైటిల్ చూడగానే కంగారు పడ్డాను : కేటీఆర్

ktrఈ టైటిల్ చూడగానే కంగారు పడ్డాను అని తెలిపారు మంత్రి కేటీఆర్. పెళ్లి చూపులు సినిమా ఫేం తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన సినిమా ఈ నగరానికి ఏమైంది. సోమవారం (జూన్-25) జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు కొంత భయపడ్డాను అని నవ్వుతూ తెలిపారు. వర్షకాలం వస్తే వార్తపత్రికల్లో ఈ నగరానికి ఏమైంది అనే వార్తలు కనిపిస్తుంటాయని.. అయితే వాటితో ఈ సినిమా కథకు సంబంధం ఉండదని అనుకుంటున్నాను అని చెప్పారు. తరుణ్‌భాస్కర్ కోసమే ఈ వేడుకకు వచ్చానని.. అతడు తెరకెక్కించిన పెళ్లిచూపులు తనకు చాలా నచ్చింది అన్నారు. ఈ నగరానికి ఏమైంది కూడా బిగ్ హిట్ కావాలని కోరుతున్నట్లు చెప్పారు మంత్రి కేటీఆర్. సురేశ్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 29న రిలీజ్ కానుంది. ఈ కార్యక్రమంలో హీరో రానా, సురేశ్ బాబు పాల్గొన్నారు. ఈ మూవీలో విశ్వక్సేన్, సాయిసుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గొమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలో నటించారు.

Posted in Uncategorized

Latest Updates