టైపిస్ట్ బామ్మ: టైపింగ్ లో యమా స్పీడ్

typistఆమె ఓ బామ్మ. కానీ.. పని విషయంలో మాత్రం యమా స్పీడు. మధ్యప్రదేశ్ సెహోర్ లో ఉంటున్న ఈ బామ్మ పేరు లక్ష్మీబాయి. వయసు 72 ఏళ్లు. జిల్లా కలెక్టరేట్ ముందు టైపిస్ట్ గా పనిచేస్తోంది. డాక్యుమెంట్లు తీసుకుని.. వివరాలు కనుక్కుని బామ్మ అలా అక్షరాలు టైప్ చేస్తుంటే చూస్తూ ఉండిపోవాల్సిందే. చేతుల్లో వణుకులేదు… పనిలో బెరుకులేదు. ఇంగ్లీష్ తో సమస్య అసలే లేదు. ఈ ఏజ్ లోనూ టైప్ రైటర్ పై పనిచేస్తున్న లక్ష్మీబాయి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

ఈ వీడియోను క్రికెటర్ వీరేంద్రసెహ్వాగ్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈమ బామ్మ కాదు.. సూపర్ ఉమన్ అని పొగిడాడు. దేశంలో ఎంతోమంది యూత్.. ఈమెను చూసి నేర్చుకోవాలన్నాడు.  చేసే పని ఏదీ తక్కువది కాదు… పనికి, నేర్చుకోవడానికి వయసు అడ్డురాదని అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

 

Posted in Uncategorized

Latest Updates