టైమ్ వచ్చినప్పుడే : మాజీ సీఎం కిరణ్ తో సమావేశమైన ఉమెన్ చాందీ

reddyమాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ. హైదరాబాద్ వచ్చిన చాందీ.. కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన నివాసంలో గంటన్నర పాటు సమావేశమయ్యారు. కిరణ్ తో సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన ఉమెన్ చాందీ… రాహుల్ ఆదేశాలతో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు . కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లినవారిని తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కుటుంబ మనిషేనన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపర్చేందుకు చాలా కృషి చేయాల్సి ఉందన్నారు చాందీ. కాంగ్రెస్ లో చేరుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెప్తానన్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్  రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates