టొరంటోలో కాల్పులు : ఒకరి మృతి, 13 మందికి గాయలు

కెనడా దేశ రాజధాని టొరంటోలో కలకలం. కాల్పులతో మోతమోగింది. సిటీలోని గ్రీన్ టౌన్ అనే రద్దీ ఏరియాలో ఓ రెస్టారెంట్ లో ఆగంతకుడు కాల్పులు జరిపాడు. తుపాకీతో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. ఆ తర్వాత తనను తాను కాల్పుకున్నాడు ఆ ఆగంతకుడు. అతను ఎవరు.. ఎందుకు కాల్చాడు అనే విషయాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

రెస్టారెంట్ లో బర్త్ డే పార్టీ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఫైరింగ్ ఓపెన్ చేయగానే రెస్టారెంట్ లోని అందరూ పరుగులు పెట్టారు. చాలా మందికి శరీరం వెనక భాగాల నుంచి తూటాలు దూసుకెళ్లాయి. వీరిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. కాల్పులు ఆగిన వెంటనే.. నిందితుడిని పట్టుకోవటానికి ప్రయత్నించారు రెస్టారెంట్ సిబ్బంది. వారిని చూసిన ఆగంతకుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెస్టారెంట్ పరిసరాలను పోలీసులు చుట్టుముట్టారు. హై అలర్ట్ ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆగంతకుడు ఉన్నాడా అనే కోణంలో సోదాలు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates