ట్యాంక్ బండ్ కు చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంక్ బండ్ చేరుకున్నాడు. నిన్న రాత్రి పొద్దుపోయాక పూజలు పూర్తికావడంతో.. మహాగణపతిని ఉదయం కల్లా క్రేన్ పైకి చేర్చారు. ఆ తర్వాత మరోసారి పూజలు నిర్వహించిన తర్వాత “సప్త ముఖ కాలసర్ప మహాగణపతి” యాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర మొదలుకాకముందే ఖైరతాబాద్ గణేశ్ యాత్ర మొదలుకావడంతో.. వడివడిగా రథం కదిలింది. వందలాది మంది భక్తులు మహా గణేశ్ యాత్రలో పాల్గొన్నారు.

11 గంటలకల్లా ట్యాంక్ బండ్ చేరుకున్నాడు మహాగణపతి. భారీ వాహనం నుంచి క్రేన్ పైకి చేరుస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట లోపే ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates