ట్యాంక్ బండ్ పై యాక్సిడెంట్: 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన బైక్

రోడ్డు ప్రమాదాలు జనాన్ని భయపెడుతున్నాయి. నడుచుకుంటూ వెళ్లే వారిని కూడా వాహనాలు ఢీ కొంటున్నాయి. రెప్పపాటులోనే బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈనెల 14న హైదరాబాద్ టాంక్ బండ్ పై  జరిగిన ప్రమాదంలో  ఏపీ బాపట్లకు చెందిన వెంకటేశ్వర రావు తీవ్ర గాయపడ్డారు. ఉదయం 10 గంటల 40 నిమిషాల సమయంలో రోడ్డు దాటుతున్న వెంకటేశ్వర రావును సికింద్రాబాద్ వైపు నుంచి వస్తున్న ఓ బైక్ డీ కొంది. దీంతో వెంకటేశ్వర రావు ఎగిరి బైక్ హ్యాండిల్ పై  పడ్డాడు. అతడిని 300 మీటర్లు అలాగే తీసుకెళ్లాడు బైకిస్టు. ట్యాంక్ బండ్ పై ఉన్న సీసీ కెమెరాల్లో ప్రమాదం  విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తల్లికి పిండప్రదానం చేయడానికి వచ్చి గాయపడ్డాడు వెంకటేశ్వరావు.

Posted in Uncategorized

Latest Updates