ట్యాక్స్ తగ్గించేది లేదంటున్న కేంద్రం : పెట్రోల్ రేటు ఎంత పెరిగినా భరించాల్సిందే

petrolపెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.81.11, లీటర్ డీజిల్ రూ.73.72కి చేరుకున్నది. దేశంలోనే అత్యధికంగా ముంబైలో పెట్రోల్ రూ.84.07, డీజిల్ రూ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే అత్యధికంగా ముంబైలో పెట్రోల్ రేటు ఎక్కువగా ఉంది. డీజిల్ అయితే హైదరాబాద్ లో హయ్యస్ట్ ఉంది. ఈ ధరలపై వాహనదారులు భగ్గుమంటున్నారు. వెంటనే పన్నులు తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంది. 10 రూపాయల వరకు ట్యాక్స్ తగ్గించాలని.. లేకపక్షంలో కేంద్రానికి ఇబ్బందులు తప్పవని వార్నింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ ను లైట్ తీసుకుంటోంది కేంద్రం.

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ఆయిల్ ధరలపై స్పందించారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సామాన్యులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. అయినా తగ్గింపుపై మాత్రం హామీ ఇవ్వలేదు. ధరల పెరుగుదల తమ చేతుల్లో ఏమీ లేదన్నారు. ఎంత పెరిగినా వినియోగదారులు భరించాల్సిందే అన్నారు. ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు వస్తన్న వార్తలను కూడా ఖండించారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని.. ఎంత పెరిగినా వినియోగదారులే భరించాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే తగ్గింపుపై మాత్రం ఓ ఆలోచన చేస్తున్నాం అంటూ సన్నాయినొక్కులు నొక్కారు.

ఒపెక్ దేశాల్లో ఆయిల్ ఉత్పత్తులు తగ్గిపోవడం, వెనుజులాలో రాజకీయ అనిశ్చితి, అమెరికా-ఇరాక్ దేశాల మధ్య వివాదాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరల పెరుగుదలకు దారి తీసిందన్నారు. ఇప్పటికే దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో.. లీటరు పెట్రోట్ ధర గరిష్ఠస్ధాయికి చేరుకుంది.

 

Posted in Uncategorized

Latest Updates