ట్యాక్స్ విషయంలో : టోల్ గేట్ దగ్గర కొట్టుకున్న గ్రామస్ధులు, సిబ్బంది

HARహర్యానాలో టోల్ దగ్గర సిబ్బంది.. స్థానిక ప్రజలు కొట్టుకున్నారు. కర్నాల్ అనే గ్రామానికి సమీపంలో టోల్ గేట్ ఉంది.  అయితే సాధారణంగా స్థానికులకు టోల్ నుంచి మినహాయింపు ఇస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం తమకు మినహాయింపు ఇవ్వకుండా.. దాడి చేశారని.. తీవ్రంగా కొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. కాల్పులు కూడా జరిపారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి టోల్ గేట్ ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.   పరిస్ధితి అదుపులోకి తీసుకొచ్చారు.

 

Posted in Uncategorized

Latest Updates