ట్రంప్‌ సర్కార్‌ కు ఆర్థిక ఇబ్బందులు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ మరోసారి ఆర్థిక కష్టాల్లో కూరుకపోయింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు అంగీకరించలేదు డెమోక్రాట్లు. ఈ విషయంపై ట్రంప్‌, డెమోక్రాట్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి వరకూ చర్చలు జరిగాయి. కానీ అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ట్రంప్‌, డెమోక్రాట్ల మధ్య రాజీ కుదరలేదు. ఈ విషయంపై ఇవాళ (శనివారం) కూడా చర్చలు కొనసాగనున్నాయి.

డెమోక్రాట్ల వల్లే ప్రభుత్వాన్ని స్తంభింపజేయాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్. అయితే ఇది ఎంతోకాలం ఉండదని  ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. ప్రభుత్వ స్తంభనతో ఆర్థిక ఖజానా మూతపడింది. దీంతో  నిధుల కొరత వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. క్రిస్మస్‌ సీజన్‌లో దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా ఇళ్లకే పరిమితం కానున్నారు.  అమెరికా ప్రభుత్వం స్తంభించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. మరోవైపు అమెరికా ఫెడరల్‌ వ్యయ బిల్లు విషయంపై శ్వేతసౌధం అధికారులు, రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు చెందిన కాంగ్రెస్‌ నేతల మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates