ట్రంప్ అల్లుడు… పన్ను కట్టడు

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ జేర్డ్ కుష్నెర్ పన్నులు కట్టడం లేదంట. ఈయనకు 324 మిలియన్ డాలర్ల(రూ.2,400కోట్లు) విలువైన నికర ఆస్తి ఉంది. కుష్నెర్ కు సంబంధించిన కంపెనీలు లాభాల్లోనే ఉన్నాయి. కానీ ఈయన కంపెనీలు గత కొన్నేళ్లుగా ట్యాక్స్ లు కట్టడం లేదని, ఒకవేళ కట్టినా అతిచిన్న మొత్తాన్ని మాత్రమే కట్టాయని న్యూయార్క్ టైమ్స్ ఆరోపించింది. ట్యాక్స్ మెకానిజమ్స్లో ఉన్న లొసుగులతో, చట్టాన్ని ఉల్లంఘించకుండానే 2009నుంచి 2016 మధ్య ఫెడరల్ ఇన్ కమ్ ట్యాక్స్ లను కట్టలేదని చెప్పింది. తాము సేకరించిన రహస్య ఫైనాన్షియల్ డాక్యుమెంట్లతో ఈ విషయం తెలిసినట్లు రాసింది. గత ఏడేళ్లలో కుష్నెర్ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ కంపెనీల లాభాలు, ఖర్చులు, నష్టాలకు సంబంధించి మొత్తం 40 పేజీల డాక్యుమెంట్లను అనలైజ్ చేసినట్లు చెప్పింది. అయితే కుష్నెర్ కట్టాల్సిన ట్యాక్స్ ఎంత, ఎగ్గొట్టిన పన్ను ఎంత అనే విషయాన్ని మాత్రం న్యూయార్క్ టైమ్స్ చెప్పలేదు. ఈ ఆరోపణలను కుష్నెర్ లాయర్ అబ్బే లోవెల్ అధికార ప్రతినిధి పీటర్ మిరిజానియన్ ఖండించారు. న్యూస్ పేపర్లు రాసే ఊహాజనిత కదనాలపై స్పందించాల్సిన పనిలేదని చెప్పారు. అన్నీ ట్యాక్స్ లను కుష్నెర్ చట్టప్రకారం చెల్లిస్తున్నారని తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ ఆరోపణలపై వైట్ హౌస్ కానీ, కుష్నెర్ కంపెనీలు కానీ ఇంకా స్పందించలేదు.

Posted in Uncategorized

Latest Updates