ట్రంప్ – కిమ్ ఒప్పందం : ఈ తీర్మానాలపైనే సంతకాలు

trum kimప్రపంచవ్యాప్తంగా సంచలనం అయిన అమెరికా – ఉత్తర కొరియా దేశాల అధ్యక్షుల మధ్య ఒప్పందం జరిగింది. రెండు దేశాధినేతలు సంతకాలు చేశారు. మొత్తం నాలుగు తీర్మానాలకు అంగీకరిస్తూ నార్త్ కొరియా అధినేత కిమ్ సంతకం చేశారు.

తీర్మానాలు ఇలా ఉన్నాయి :

  • ఉత్తరకొరియాలోని అణు పరీక్ష కేంద్రాలను పూర్తిగా నిర్మాలన చేయటం. 2018 ఏప్రిల్ 27వ తేదీనాటి పాన్ ముంగ్ జోమ్ తీర్మానానికి అనుగుణంగా అణ్వస్త్రరహిత దేశంగా గుర్తింపు తెచ్చుకోవాలి. భవిష్యత్ లోనూ అణ్వాయుధాలు తయారీ చేపట్టకూడదు. వాటికి సంబంధించిన అన్ని ప్రయోగశాలలు, టెక్నాలజీని ధ్వంసం చేయాలి.
  • యుద్ధ ఖైదీల పేరుతో ఉత్తరకొరియాలో జైళ్లలో ఉన్న వివిధ దేశాల వారిని వెంటనే విడిచి పెట్టాలి.
  • నార్త్ కొరియాలో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించటం, అభివృద్ధిలో అమెరికా భాగస్వామ్యం ఉంటుంది. రెండు దేశాలు కలిసి కొత్త విధానాలు రూపొందించి ముందుకు సాగటం
  • ఇక నాలుగోది.. ఉత్తరకొరియాలో శాశ్వత శాంతి స్థాపన. అమెరికా భాగస్వామ్యంతో దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగటం.

 

Posted in Uncategorized

Latest Updates