ట్రంప్ నిర్ణయం సరైందే.. అమలు చేస్తారా అన్నదే డౌట్ : పుతిన్

సిరియా నుంచి అమెరికా బలగాలను వెనక్కి పిలిపించాలని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భారీసంఖ్యలో జర్నలిస్టులు హాజరైన ప్రెస్ మీట్ లో మాట్లాడిన పుతిన్… ఇస్లామిక్ స్టేట్ ను అమెరికా ఓడించిందన్న యూఎస్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నా అని చెప్పారు. అయితే.. సిరియాలోకి అక్రమంగా అమెరికా బలగాలు వచ్చాయన్నారు. బలగాలను మోహరించడానికి సిరియా ప్రభుత్వం గానీ, ఐక్యరాజ్యసమితి గానీ అనుమతి ఇవ్వలేదన్నారు. ట్రంప్ ఆప్ఘనిస్థాన్ విషయంలో ఏం చేశారో ఓసారి గుర్తుంచుకోవాలన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి బలగాలను వెనక్కి పిలుస్తామని 17 ఏళ్లుగా అమెరికా చెబుతూ వస్తున్నా… ఇప్పటి వరకు అది జరగలేదన్నారు పుతిన్.

మరోవైపు.. సిరియాలో పాతుకుపోవాలన్న ఇరాన్ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా సహకారంతో తాము చాలా చేశామన్న ఇజ్రాయెల్ ప్రభుత్వం… ఇకపైనా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పింది.

ఇంకోవైపు.. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు ట్రంప్ ప్రకటనను తప్పుపట్టాయి. సిరియాలో ఐసిస్ ను ఓడించామని ట్రంప్ చెప్పడం సరికాదని ప్రకటించాయి. అక్కడ ఉగ్రవాదం ఇంకా బతికే ఉందని చెప్పారు ఇంగ్లాండ్ రక్షణశాఖ అధికారి ఎల్ వుడ్.

Posted in Uncategorized

Latest Updates