ట్రంప్ మరో షాక్: ప్రభుత్వ సాయం పొందితే గ్రీన్ కార్డులివ్వం

అమెరికాలో నివసిస్తున్న భారతీయులు మరిన్ని కష్టాలను ఎదుర్కోనున్నారు. గ్రీన్‌ కార్డు జారీ ప్రక్రియలో ట్రంప్ సర్కారు మరిన్ని కఠిన నిబంధనలు విధించింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు దేశం అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందకూడదనే కొత్త నిబంధన చేర్చింది. ఈ నిబంధన ప్రకారం ఆహార, నగదు సంబంధిత పథకాల్లో గ్రీన్‌ కార్డు ద‌ర‌ఖాస్తుదారుల పేర్లు నమోదై ఉండకూడదు. విద్యా, వైద్య, ఆహార, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందిన…పొందుతున్న వలసదారులకు గ్రీన్ కార్డులను నిలిపివేయాలన్న ఆలోచనలో ఉంది. ఇది కార్యరూపం దాల్చితే అమెరికాలో నివసిస్తోన్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ ప్రతిపాదిత నిబంధనపై సెప్టెంబర్‌ 21న అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌)కార్యదర్శి సంతకం చేశారు.

అంతేకాదు గ్రీన్‌కార్డు వస్తే అమెరికాలో ఆర్థికంగా తమను తాము పోషించుకోగలమని రుజువు చేస్తూ ఆర్థిక వివరాలను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates