ట్రంప్ వైఖరికి నిరసనగా…కుక్కలకు మాత్రమే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని ట్రంప్ ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకూ ఆయన తీసుకొన్న ప్రతి నిర్ణయంలో ఏదో ఒక వివాదము ఉంటుంది. వివాదాలకు మారుపేరు ఎవరంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టి ఏడాది గడిచినా ఇంకా కొంతమందిలో ట్రంప్ పై వ్యతిరేకత తగ్గలేదు.

ట్రంప్‌ పై తనకున్న అసహ్యాన్ని తెలియజేయాడానికి ఓ వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నాడు న్యూయార్క్‌కు చెందిన ‘పోర్క్యపైన్‌ అర్మడిల్లా’ అనే వీడియో కంపెనీ యజమాని ఫిల్‌ గాబ్లే. ట్రంప్‌ విగ్రహాలు తయారు చేయించి వాటి మీద ‘పీ ఆన్‌ మీ’అని రాయించాడు. ఈ విగ్రహాలను న్యూయార్క్‌ లోని  ఐదు ముఖ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేశాను పలు ఏరియాల్లో ప్రతిష్టించాడు. ట్రంప్‌ అధ్యక్షుడిగా కాదు కదా కనీసం మనిషిగా కూడా పనికిరాడని, అతని మీద నా వ్యతిరేకతను తెలియజేయడం కోసం ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నట్లు గాబ్లే తెలిపారు. అయితే ఇక్కడ కేవలం కుక్కలు మాత్రమే మూత్ర విసర్జన చేయాలని, నా వరకూ ఇది హస్యంతో కూడిన వ్యంగ్యం గాబ్లే తెలిపాడు.

 

Posted in Uncategorized

Latest Updates