ట్రయాంగిల్స్ ఫజిల్ : బుర్ర గోక్కుంటున్న బాలీవుడ్.. మరి మీరు

SAYపాపులర్ ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ జితేష్ పిల్లై ఇటీవల తన ట్విట్టర్ లో  షేర్ చేసిన ఓ ఫజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో  చెప్పండి అంటూ ఓ ఫజిల్  పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే.. ఆ ట్వీట్ కు పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్వీట్ పై బాలీవుడ్ సెలబ్రిటీలు సోనమ్ కపూర్, అదితిరావ్ హైదరీ, దినాయా పెంటీ తదితరులు ఈ ఫజిల్ ను సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఒకరు 7 అని, మరొకరు 10 అని, మరికొందరు 18 అని, మరికొందరు కాదు కాదు 24 అంటూ కామెంట్స్ చేయడంతో ఇది సరదా సంభాషణగా మారిపోయింది.

అయితే ఈ ప్రశ్నకు జితేష్ దగ్గరైనా సమాధానం ఉందా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టేందుకు నెటిజన్లుయ లెక్కల్లో మునిగిపోయారు. ప్రస్తుతానికి బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించటంతో విపరీతమైన షేర్స్ అవుతుంది. కాకపోతే ఎవరూ కూడా కచ్చితమైన సమాధానం ఇదీ అని చెప్పటం లేదు. ఎవరైనా లెక్కల మాస్టర్ చేతిలో పడితేకానీ అసలు సమాధానం రాదండీ.. అప్పటి వరకు ఇలా ఇది చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ప్లీజ్ మీకు తెలిస్తే వెంటనే ఆన్సర్ చెప్పేయండి..

Posted in Uncategorized

Latest Updates