ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి మాదన్నపేటలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ మాదన్నపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం సంతోష్‌ హోటల్‌ చౌరస్తాలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో మంటలు విద్యుత్‌ తీగలకు అంటుకుని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో విద్యుత్‌ తీగలు దగ్ధమయ్యాయి. భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసింది.

 

Posted in Uncategorized

Latest Updates