ట్రాఫిక్ డైవర్షన్ తో సిటి జనం ఇబ్బందులు

హైదరాబాద్ : సిటీలో ట్రాఫిక్ తోనే నానా తంటాలు పడుతున్న వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. రాత్రి ఉన్న యూటర్న్ పొద్దున ఉండదు. ట్రాఫిక్ పోలీసులు.. రైట్-లెప్ట్ టర్న్ లను ఎప్పుడు ఎత్తేస్తారో.. ఎప్పుడు వాహనాల యూటర్న్ కు అనుమతిస్తారో తెలియక అవస్థలు పడుతున్నారు వాహనదారులు. మెట్రో పనులతో  జనానికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. అమీర్ పేట్ టు హైటెక్ సిటీ లైన్ మెట్రో వర్క్స్ నడుస్తుండటంతో .. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. సైబర్ టవర్స్ టూవర్డ్స్ ట్రీడెంట్ లైమ్ టరీ, ఐకియా, మైండ్ స్పేస్ అండర్ పాస్ మీదుగా కూడా మెట్రో పనులు జరుగుతున్నాయి.

సైబర్ టవర్స్ నుంచి మెట్రో పనులు స్లోగా జరుగుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు మాత్రం ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నారంటున్నారు వాహనదారులు.  సైబర్ టవర్స్ నుంచి బయోడైవర్సిటీ వరకు ప్రయాణించాలంటే భయపడుతున్నారు.  ఈ రూట్లో  ఆరు యూటర్న్స్ ఉండేవి. ఐకియా ఎదురు అండర్ పాస్ వే నిర్మించడంతో దానికి 500 మీటర్ల దూరంలోని యూటర్స్ క్లోజ్ చేశారు. ఇక వాటికి తోడు మెట్రో పనుల కోసం.. ట్రాఫిక్ పోలీసులు ఉన్న యూటర్న్ లను ఒక్కోటిగా క్లోజ్ చేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్లలో రెండు మాత్రమే యూటర్న్ లు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదంటున్నారు కార్ డైవర్లు.

డ్యూటీ అవర్స్ లో సమస్య ఎక్కువవుతోందని అంటున్నారు ఐటీ ఉద్యోగులు. ట్రాఫిక్ జామ్ తో 10 నిమిషాల జర్నీ కాస్త గంట పడుతోందని చెబుతున్నారు. ఈ రూట్ లో రోడ్ కు రెండు వైపులా వందల కంపెనీలు ఉన్నాయి. దీంతో మార్నింగ్, ఈవెనింగ్ అవర్స్ లో ట్రాఫిక్ పీక్ లెవల్ లో ఉంటోంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో డైవర్షన్లు, ఉన్న యూటర్న్ లను ఎత్తివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

మెట్రో పనులు పూర్తి అయ్యేదెప్పుడు..ట్రాఫిక్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడని ఎదురుచూస్తున్నారు వాహనదారులు. ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా ట్రాఫిక్ మళ్లింపులు చేస్తుండటంతో ఇంకా కష్టమవుతోందంటున్నారు సిటీ జనం.

Posted in Uncategorized

Latest Updates