ట్రాఫిక్ నివారణే లక్ష్యం : ఎయిర్ పోర్ట్ కు ఎక్స్ ప్రెస్ మెట్రో

METRO AIRPORTహైదరాబాద్ లో  ట్రాఫిక్ ను నివారించేందుకు మెట్రోలో కొన్ని మార్పులు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సిటీని కవర్ చేసేలా మెట్రో పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అయితే నిత్యం వేల సంఖ్యలో  శంషాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ కు వస్తుంటారు ప్రయాణికులు. దీనిని దృష్టిలో పెట్టుకుని మెట్రోను అతి తక్కువ సమయంలోనే ఎయిర్ పోర్ట్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ కి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు 50 నిమిషాల సమయం పడుతుంది.

అయితే మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ ప్రెస్‌ మెట్రో కారిడార్‌ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మెట్రో అధికారులు. ఈమేరకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ కు మరో 15 రోజుల్లో తుది రూపునిచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ అధికారులు డైరెక్ట్ గా క్షేత్రస్థాయిలోకి దిగి, గురువారం (మే-17) శంషాబాద్‌–రాయదుర్గం రూట్స్ లో పర్యటించారు. ఈ మేరకు DPRను సిద్ధంచేస్తున్నారు. రూ.4 వేల 500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ మెట్రో కారిడార్‌ ఏర్పాటుతో గ్రేటర్‌ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటీజన్లకు ట్రాఫిక్‌ అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లు విమానాశ్రయానికి కనెక్టివిటీ లేకపోవడంతో..తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలో వేగం పెరగడం విశేషం.

Posted in Uncategorized

Latest Updates