ట్రాఫిక్ లో హల్ చల్ : సూపర్ మ్యాన్స్ అందరూ రోడ్డెక్కేశారు

batట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు  చెన్నైకి చేరుకున్నారు బాట్ మాన్, స్పైడర్ మాన్, సూపర్ మాన్. అన్నానగర్ సిగ్నల్ దగ్గర ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై వీళ్లు తమకున్న అతీత శక్తుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీరితో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చాలామంది ఆశక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు అయితే వీరితో షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఫొటోలు దిగటం చేస్తున్నారు. అలా తమ దగ్గరకి వచ్చిన పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ చెప్పటంతోపాటు.. మీ డాడీ, మమ్మీకి కూడా చెప్పాలి అంటూ కరపత్రాలు అందిస్తున్నారు.

చెన్నై సిటీకి చెందిన NGO సంస్థ తోజాన్స్ ట్రాఫిక్ రూల్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందు కోసం వైవిధ్యంగా ఆలోచించింది. ముగ్గురు యువకులను సూపర్ హీరోలుగా మార్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరహలో ట్రాఫిక్ అవేర్ నెస్ క్యాంపెయిన్స్ ప్రతి గురు, ఆదివారంలో నిర్వహిస్తున్నారు. ఆ రోజుల్లో వీరు బాట్ మాన్, స్పైడర్ మాన్, సూపర్ మాన్ వేషాల్లో రోడ్లపైకి వస్తారు కొంత మంది. వీరితోపాటు యమధర్మరాజా, చిత్రగుప్తుడు వంటి వేషాల్లోనూ మరికొందరు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కోసం రోడ్డెక్కాస్తారు. వాలంటీర్లు ఆ డ్రస్సులను ధరించి రద్దీగా ఉన్న సిగ్నల్స్ దగ్గర, సాయంత్రం సమయాల్లో పార్కులు, స్కూళ్లల్లో ట్రాఫిక్ పై క్యాంపెయిన్ నిర్వహిస్తారు.

దేశంలో ఏదో ఒక చోట గంటకు రోడ్డు యాక్సిడెంట్లలో 17 మంది చనిపోతున్నారని 2016 రోడ్డు యాక్సిడెంట్ ల డేటా చెబుతోందని, చెన్నై సిటిలో అయితే రోడ్ల పరిస్ధితి దారుణంగా ఉండటంతో 2016 లో 7వేల486రోడ్డు యాక్సిడెంట్స్ జకరిగాయని రాధాక్రిష్ణ అన్నారు. రోడ్డు యక్సిడెంట్ల కారణంగా ప్రతి రోజూ 119 మంది పిల్లలు చనిపోతున్నారన్నారు. ఇది చాలా విషాదకరమని, పిల్లలు 10,12 తరగతులు పాస్ అయిన వెంటనే తల్లిదండ్రులు వాళ్లకి బైక్ లు, కార్లు కొనివ్వటం కూడా ఈ ప్రమాదాలకు ఒక కారణంగా ఉందన్నారు. దీంతో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, రోడ్డు సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్సించేందుకే ఈ విధమైన వేషధారణలతో ప్రజలకు అవగాహన కల్సిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు కూడా వీరిని అభినందిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates