ట్రాఫిక్ సిగ్నల్స్ పై నవదీప్ పంచ్ : లైఫ్ లో డైరెక్షన్ లేదని తిట్టొద్దు

navdeepట్రాఫిక్ సిగ్నల్ కు సంబంధించి టాలీవుడ్ నటుడు నవదీప్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవదీప్ షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. నవదీప్ పై సరదాగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. నవదీప్ లెఫ్ట్ కి వెళ్లు అని, నవదీప్ రైట్ కి వెళ్లు అని కొందరు, మరికొందరు అయితే డ్యూడ్ మీ ఫోటోలతో మమ్మల్ని చంపేస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. రిప్ సిగ్నల్స్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ గొడవ ఏంటీ అంటారా..

నటుడు నవదీప్.. కారులో ప్రయాణిస్తున్నారు. ఓ జంక్షన దగ్గర సిగ్నల్స్ పడ్డాయి. అయితే పైన రెడ్ సిగ్నల్ ఉంది.. దాని కిందే.. లెఫ్ట్, స్ట్రయిట్ గ్రీన్ సిగ్నల్ కూడా చూపిస్తోంది. దీంతో కన్ఫ్యూజ్ అయిన నవదీప్.. సిగ్నల్స్ ఫొటో తీసి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దానికి క్యాప్షన్ ఇలా పెట్టాడు. స్టాప్ బ్లేమింగ్ మీ ఫర్ నాట్ హేవింగ్ ఏ డైరక్షన్ ఇన్ లైఫ్ ఓకే (జీవితంలో డైరక్షన్ లేదని నన్ను తిట్టడం ఆపండి) అంటూ షేర్ చేశాడు. నవదీప్ షేర్ చేసిన ఆ ఫొటోలో రెడ్‌ సిగ్నల్ ఆన్‌ లో ఉంది. దాంతోపాటు స్ట్రెయిట్‌, లెఫ్ట్‌ సిగ్నల్స్‌ ను కూడా చూపిస్తోంది. అయితే ఇది ఏ నగరంలోనిది.. ఏ ప్రాంతంలోనిది అని మాత్రం చెప్పలేదు..
nav

Posted in Uncategorized

Latest Updates