ట్రాఫిక్, హైవే పోలీసులకు రూ.48 వేల కోట్ల లంచం

  • ట్రాఫిక్, హైవే పోలీసులకు రూ.48 వేల కోట్లు 
  • లైసెన్స్ రెన్యువల్‌‌కూ లంచం ఇవ్వాల్సిందే..

న్యూఢిల్లీ: ట్రక్కు డ్రైవర్లు, ఓనర్లు లంచాల కింద ఏటా రూ.48 వేల కోట్లను ట్రాఫిక్‌‌‌‌ లేదా హైవే పోలీసులకు చెల్లించారని తాజా స్టడీలో తేలింది. దేశంలోని 10 మేజర్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్, ట్రాన్సిస్ట్ హబ్స్‌‌‌‌లో ట్రక్కు డ్రైవర్లు, ఓనర్లు ఏ మేర లంచం చెల్లిస్తున్నారనే విషయంపై సేవ్‌‌‌‌లైఫ్ ఫౌండేషన్ చేపట్టిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ స్టడీ రిపోర్ట్‌‌‌‌ను రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ విడుదల చేశారు. రెండు వంతుల మంది  డ్రైవర్లు ట్రాఫిక్ లేదా హైవే పోలీసులకు లంచం ఇస్తున్నట్టు ఒప్పుకున్నారని ఈ స్టడీ రిపోర్ట్ తెలిపింది.  ట్రాన్స్‌‌‌‌పోర్ట్ హబ్స్‌‌‌‌లో గౌహతిలో డ్రైవర్లు ఎక్కువగా లంచాలు ఇచ్చారు.  ఇక్కడ 97.5 శాతం మంది డ్రైవర్లు లంచాలు ఇచ్చినట్టు ఒప్పుకున్నారు. ఆ తర్వాత చెన్నై, ఢిల్లీలో డ్రైవర్లు అధికంగా హైవే పోలీసులకు లంచాలు ఇచ్చినట్టు వెల్లడైంది.

తమ తాజా ట్రిప్ సందర్భంలో రోడ్డు డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెందిన అధికారులకు లేదా ఇతర డిపార్ట్‌‌‌‌మెంట్ వారికి లంచం ఇవ్వాల్సి వచ్చిందని 82 శాతానికి పైగా రెస్పాడెంట్లు చెప్పారు. అనధికారిక చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌లను దాటేందుకు కూడా లోకల్ గ్రూప్‌‌‌‌లకు లంచాలు ఇచ్చామని తెలిపారు. మొత్తంగా ఒక్కో ట్రిప్ కోసం చెల్లించే లంచం సగటున రూ.1,257గా ఉంది.  రోడ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అధికారులకు కూడా లంచాలు ఇచ్చినట్టు 44 శాతం రెస్పాడెంట్లు చెప్పారు. ఇలా బెంగళూరులో ఆర్‌‌‌‌‌‌‌‌టీఏ అధికారులకు, ఆ తర్వాత గౌహతిలోనూ  లంచాలిచ్చినట్లు సర్వేలో తేలింది. డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌ల రెన్యువల్‌‌‌‌కు కూడా లంచాలు ఇచ్చినట్టు 47 శాతం మంది డ్రైవర్లు ఒప్పుకున్నారు.  యావరేజ్‌‌‌‌గా లైసెన్స్ రెన్యూవల్ కోసం ఒక్కో డ్రైవర్ రూ.1,789 చెల్లించినట్టు తెలిసింది. అత్యధికంగా ఢిల్లీలో రూ.2,025 చెల్లించారని రిపోర్ట్‌‌‌‌లో వెల్లడైంది. కొత్త వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కోసం ట్రాన్స్‌‌‌‌పోర్ట్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు 43 శాతం మంది ఓనర్లు లంచాలు చెల్లించారు.

ఇండియాలో బండి నడవాలంటే డీజిల్‌‌ కంటే ముందు లంచాలివ్వడానికి చేతిలో డబ్బుండాలి. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజమని ఒక సర్వే తేల్చింది. దేశంలో తిరిగేప్పుడు ట్రక్కు డ్రైవర్లు, ఓనర్లు ట్రాఫిక్‌‌, హైవే పోలీసుల నుంచి రోడ్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఆఫీసర్లకు, చెక్‌‌పోస్టుల దాకా లంచాలు ఇవ్వాల్సిందేనని వెల్లడైంది.  అనధికారిక స్లిప్‌‌లు ఇచ్చి మరీ లంచాలు కొట్టేస్తున్నారు ఈ ప్రబుద్ధులు. ఇలా లంచాలుగా ఇచ్చే మొత్తం ఏటా రూ. 48 వేల కోట్లంటే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే.

Latest Updates