ట్రాయ్ కొత్త రూల్ : భారీగా పెరగనున్న టీవీ ఛానళ్ల ధరలు

ఉదయం లేచినప్పట్నుంచీ పడుకునే వరకు అన్నం తినకుండా అయినా ఉంటాం కానీ..టీవీ చూడకుండా ఉండలేము అనేది అందరికీ తెలుసు. మారుతున్న లైఫ్ స్టైల్ కి తోడు రకరకాల ఛానళ్లు వస్తున్నాయి. నచ్చిన ఛానల్ కి అలవాటు పడిపోతున్నారు. ప్యామిలీలో ఐదుగురు ఉంటే ..భర్తకి భక్తి ఛానల్, భార్యకి సీరియల్, పెద్దబ్బాయ్ కి న్యూస్, అమ్మాయికి సినిమాలు, చిన్నబ్బాయికి  స్పోర్ట్స్, కోడలికి వంట చిల్కాలు. ఇలా ఎవరికి తగ్గట్టుగా వారు ఛానళ్లకు అలవాటు పడిపోయారు. ఇవన్నీ కలిసీ ఒకే ప్యాక్ లో తక్కువ ధరకు వస్తున్నాయి. కానీ .. ఇక నుంచి టీవీ బిల్లు మోగిపోనుంది. ఛానల్స్  ధరలు కొండక్కనున్నాయి. పెరగనున్న భారీ ధరలకు మధ్య తరగతి వారు కొన్ని ఛానళ్లకు వదులుకోక తప్పదేమో.

ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకారం డిసెంబర్ -29 నుంచి ఛానళ్ల ధరలు విఫరీతంగా పెరగనున్నాయి. ఇప్పుడు DTHలో.. రూ.150 నుంచి 250 వరకే ఉన్న ప్యాకేజీలు.. రూ.150 నుంచి 750 పెరిగే అవకాశం ఉంది. 100 ఉచిత ఛానల్స్ వరకు రూ.130 మాత్రమే.  పే ఛానల్ ఏది చూడాలన్నా అదనంగా చెల్లించక తప్పదు. ఒక్కో యాడ్ ఆన్ ఛానల్ కి ఒక్కో రేటు ఉంటుంది. స్పోర్ట్స్ ప్యాక్, సినిమా ప్యాక్, సీరియల్ ప్యాక్ అంటూ కొత్త ధరలు రానున్నాయి. కొత్త రూల్స్ తో 95 శాతం మంది కస్టమర్లకు బిల్లులు పెరగనున్నాయంటున్నారు ట్రాయ్ అధికారులు . ఎంచుకునే ఛానళ్లను బట్టి బిల్లు కనీసం రూ.600 నుంచి వెయ్యి కానుంది. ట్రాయ్ కొత్త నిబంధనలతో రాబోతున్న మార్పు ఇదే. సిటీల్లో మాత్రమే కాదు పట్టణాలు, గ్రామాల్లోనూ టీవీ బిల్లులు తడిసి మోపెడు కానున్నాయి. అయితే దీనిని వ్యతిరేకిస్తున్నాయి ఎమ్మెస్వోలు. అమలును వాయిదా వేయాలని ట్రాయ్ ని కోరుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates