ట్రాయ్ రూల్స్ : ఇండియాలో ఐఫోన్లు పని చేయవా?


ఇండియాలో ఐఫోన్లు పనిచేయవా.. ఇప్పుడు ఇదే యూజర్లలో క్వశ్చన్. దీనికి కారణం లేకపోలేదు. ట్రాయ్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధన. మీకు ఫ్లాట్ కావాలా.. లోన్ కావాలా.. ఆఫర్స్ ఉన్నాయి అంటూ ఫోన్లు, మెసేజ్ లు వస్తుంటాయి కదా.. వాటిని కంట్రోల్ చేయటం కోసం ట్రాయ్ ఓ యాప్ తీసుకొచ్చింది. అదే నాట్ డిస్టర్బ్. ట్రాయ్ విడుదల చేసిన ఈ యాప్ వేసుకుంటే అలాంటి కాల్స్, మెసేజ్ లు రావు. ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో ఇది అందుబాటులో ఉంది. దీనికి ఆయా వెర్షన్ ఉపయోగించే కంపెనీలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం సమస్య ఉత్పన్నం కాలేదు.. అయితే ఇప్పుడు ఓఎస్ ఫ్లాట్ ఫాంపై నడిచే ఐఫోన్లలోనూ ఈ యాప్ ఉపయోగించాలి అంటే ఐఓఎస్ పర్మీషన్ అవసరం. అయితే యూజర్ల డేటా భద్రతకు అధిక ప్రాధాన్య ఇచ్చే ఐఫోన్.. ఇందుకు అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ట్రాయ్ విడుదల చేసిన DND (డునాట్ డిస్టర్బ్) యాప్ వాడుకోవాలంటే.. ఆపరేటింగ్ సిస్టమ్ ఈ యాప్ కు కంట్రోల్ ఇవ్వాలి. అలా కంట్రోల్ ఇస్తే కాల్ రికార్డ్స్, SMS మొత్తం యాప్ పరిధిలోకి వెళతాయి. అయితే దీనికి ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ అనుమతి ఇవ్వదు. యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే యాపిల్ కంపెనీ.. ట్రాయ్ కు లేఖ రాసింది. ట్రాయ్ యాప్ యాపిల్ ఫోన్ లో ఉన్నట్లయితే.. మా యూజర్ల డేటా భద్రతకు నష్టం వస్తుంది.. మీకు పర్మీషన్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. కాల్ రికార్డ్స్, SMS రీడింగ్ చేసే యాప్ ద్వారా యాపిల్ యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని.. ఇది మా కంపెనీ విధానాలకు విరుద్ధమని ట్రాయ్ కు ఘాటుగా లేఖ రాసింది.

ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. భారత టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ల ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ 2018 తీసుకొచ్చిన కొత్త సవరణలు చూస్తే.. భారతదేశంలోని అన్ని ఫోన్లలో ట్రాయ్ యాప్ ఉండాల్సిందే అని చెబుతోంది. దీనికి యాపిల్ కంపెనీ నో అంటోంది. యాపిల్ పర్మీషన్ ఇవ్వకపోతే.. ఆ ఫోన్లకు నెట్ వర్క్ ఇవ్వకూడదని కొత్త రెగ్యులేషన్ ద్వారా ఆయానెట్ వర్క్ సర్వీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఐఫోన్లలోని ఐఓఎస్ ను యాప్ నియంత్రణలోకి ఇవ్వకపోతే భారత్ ఐఫోన్లకు నెట్ వర్క్ కట్ అవుతుంది. ఇదే ఇప్పుడు యూజర్లను కలవరపెడుతోంది. ట్రాయ్ వెనక్కి తగ్గుతుందా లేక యాపిల్ వెనక్కి తగ్గుతుందా అనేది చూడాలి.

యాపిల్ మాత్రం యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీకి ప్రాధాన్యత అని స్పష్టం చేస్తోంది. గతంలో అమెరికాలోనే ఓ నేరస్తుడి ఐఫోన్ అన్ లాక్ చేయటానికి ఒప్పుకోలేదు. కోర్టుకి వెళ్లినా అమెరికా FBIకి చుక్కెదురు అయిన విషయం తెలిసింది. భారత్ లో ఎలా వ్యవహరిస్తుంది.. తన స్టాండ్ ఏ విధంగా ఉండబోతున్నది అనేది మరో 20 రోజుల్లో తేలిపోనుంది.

Posted in Uncategorized

Latest Updates