ట్రూడ్ ఫ్యామిలీతో మోడీ : హగ్ ఇచ్చాడు.. ముద్దు చేశాడు.. లాలించాడు

modiవారం రోజుల భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఈ రోజు(ఫిబ్రవరి23) ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగంణంలో వీరికి ప్రధాని మోడీ ఆత్మీయ స్వాగతం పలికారు. ట్రూడూను గట్టిగా హగ్ చేసుకొన్నాడు మోడీ. ట్రూడూ పిల్లలను ముద్దు చేశారు మోడీ. వారితో కలసి ఫోటోలు దిగారు. ఆ సమయంలో ట్రూడూ చిన్న కొడుకును తన దగ్గరే ఉంచుకొని ఆ పిల్లాడితో కలసి మోడీ కూడా చిన్న పిల్లవాడిలా ఆటలాడారు.

అయితే గత వారం భారత పర్యటనకు వచ్చిన ట్రూడూ కుటుంబసభ్యులకు అన్నీ దేశాధినేతలకు ఇచ్చిన రీతీలో మోడీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి వారిని స్వాగతించలేదు. దీనిపై మోడీ ట్రూడూ ఫ్యామిలీని పట్టించుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కలిస్ధాన్ వేర్పాటువాదానికి తాము వ్యతిరేకం అని చెప్పిన ట్రూడూ, వేర్పాటువాది నాయకుడు తో  ట్రూడూ ఫ్యామిలీ కలసి ఫోటోలు దిగడం కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ సమయంలో ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ తన ఆత్మీయ స్వాగతంతో ట్రూడూ ఫ్యామిలీని ఆహ్వానించారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates