ట్రెండింగ్ లో నం.1 మణికర్ణిక ట్రైలర్.. డైరెక్టర్ గా కంగన పేరు

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘మణికర్ణిక’ సినిమా ట్రైలర్ ఆన్ లైన్ లో దుమ్ములేపుతోంది. యూట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లోనే 7 మిలియన్ల వ్యూస్ దాటింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగన నటించింది. టీజర్ తోనే ఇండస్ట్రీని అలర్ట్ చేసిన మణికర్ణిక మూవీ… ట్రైలర్ తో టాక్ ఆఫ్ బాలీవుడ్ గా మారింది.

బ్రూస్ లీ తర్వాత కంగన కళ్లలో అంతటి రౌద్రం చూశా : వర్మ

హిందీ, తెలుగు, తమిళం సహా.. దేశమంతటా మొత్తం 4వేల స్క్రీన్స్ పై భారీగా స్థాయిలో విడుదలవుతోంది మణికర్ణిక మూవీ. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా.. జనవరి 25న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. బ్రిటీష్ సైన్యతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చేసిన పోరాట సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా చిత్రీకరించారు. ఝాన్సీ రాణిగా కంగన రనౌత్ యాక్షన్ అదుర్స్ అనేలా ఉంది. ట్రైలర్ చూసిన రామ్ గోపాల్ వర్మ .. తాను బ్రూస్ లీ తర్వాత కంగన కళ్లలోనే అంత రౌద్రం చూశానని .. ఆమె కళ్లనుంచి చూపు తిప్పుకోనంత బాగా చేసిందని ట్వీట్ చేశాడు.

క్రిష్ వదిలేయడం వల్లే నేను టేకప్ చేశా : కంగనా రనౌత్

మణికర్ణిక ట్రైలర్ టైటిల్స్ లో డైరెక్టర్ గా జాగర్లమూడి రాధాకృష్ణతోపాటు… కంగన రనౌత్ పేరు కూడా చేరింది. టీజర్ లో క్రిష్ పేరు మాత్రమే ఉండేది. మూవీ నుంచి క్రిష్ తప్పుకోవడంపై కంగన స్పందించింది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం క్రిష్ మణికర్ణికనుంచి తప్పుకున్నాడని చెప్పింది. క్రిష్ తో తనకు విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది. “మన నియంత్రణలో లేని కారణాల వల్లే” మణికర్ణిక సినిమా షూటింగ్ ఆలస్యం అయిందని చెప్పింది. కేవలం పరిస్థితుల వల్లే తాను మెగా ఫోన్ పట్టుకోవాల్సి వచ్చిందని వివరించింది. గతంలోనే తాను ఓ సినిమాను తీయాల్సిందని.. బడ్జెట్ లేక ఆగిపోయిందని చెప్పింది. ఆ అనుభవంతోనే మణికర్ణికను హ్యాండిల్ చేయగలిగానని చెప్పింది కంగన. బాహుబలి 1,2 సినిమాలు ఫాంటసీ యాక్షన్ సినిమాలని.. చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణికతో దానికి పోలిక లేదని చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates