ట్రై సిరీస్‌కు టీమిండియా జట్టు ఎంపిక

INDIA -TEEMశ్రీలంక, బంగ్లాదేశ్‌తో మార్చి 6 నుంచి జరిగే ట్రై సిరీస్ టీ20 కి భారత జట్టు ఎంపికైంది.  చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సమావేశమైన చీఫ్‌ సెలక్షన్‌ కమిటీ ఈ  జట్టును ఆదివారం(ఫిబ్రవరి-25) ప్రకటించింది. రోహిత్‌శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టు ట్రై సిరీస్‌లో ఆడనుంది. ముందుగా ఊహించినట్లుగానే భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ట్రై సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. ఎంఎస్‌ ధోని కూడా లంక పర్యటనకు దూరం కానున్నాడు. వీరితో పాటు జస్ర్పిత్‌ బూమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లకు కూడా విశ్రాంతినిచ్చింది కమిటీ.

టీమిండియా జట్టు:

రోహిత్‌శర్మ(కెప్టెన్‌),  శిఖర్‌ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, యజువేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, విజయ్‌ శంకర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, మహమ్మద్‌ సిరాజ్‌, రిషబ్‌ పంత్‌.

Posted in Uncategorized

Latest Updates