ట్విట్టర్ ఫాలోవర్లకు మిలియన్ థ్యాంక్స్

ts-minister-ktr-సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నారు మంత్రి కేటీఆర్‌. ట్వీటర్‌లో పది లక్షల మంది (మిలియన్‌) ఫాలోవర్లు ఉన్న రాజకీయ నేతల జాబితాలో చేరారు ఆయన. ప్రస్తుతం కేటీఆర్‌ ట్వీటర్‌ ఖాతాను పది లక్షల మంది ఫాలో అవుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న యువ రాజకీయ నేతల్లో కేటీఆర్ ఒకరు. ప్రభుత్వ పథకాలు, వాటి అమలుతోపాటు రాజకీయ, పరిపాలన అంశాలపైనా కామెంట్లు చేస్తుంటారు. పలువురి వ్యక్తిగత విజ్ఞప్తులపైనా వేగంగా స్పందిస్తారాయన. సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికార యంత్రాంగానికి ట్వీటర్‌ ద్వారానే ఆదేశాలు ఇస్తుంటారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ, చేనేత, గనులు, ఎన్‌ఐఆర్‌ వ్యవహారాలే కాకుండా సామాన్యులు చేసే ఇతర విజ్ఞప్తులపైనా కూడా ఆయన స్పందిస్తుంటారు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ మహా నగరపాలక ఎన్నికల సమయంలో ఆయన ట్వీటర్‌ ఖాతాకు కేవలం 50 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. రెండేళ్లలోనే ఈ సంఖ్య పది లక్షలకు చేరింది. కేటీఆర్‌ ట్వీటర్‌ ఖాతా రికార్డుపై తెలుగు రాష్ట్రాల బ్రిటిష్‌ హై కమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ స్పందించారు… కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. ట్వీటర్‌ ఫాలోవర్ల రికార్డుపై కేటీఆర్‌ కూడా తనదైన శైలిలో స్పందించారు. ‘ఎ మిలియన్‌ థ్యాంక్స్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates