ట్వీట్లపై కామెంట్లు.. నాకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి : కేటీఆర్

KTR D తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పోస్టులపై కొందరు నెటిజన్లు రకరకాల కామెంట్లు ట్విట్ చేస్తున్నారట. ఓ మంత్రిగా ఆయన తన కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ సినిమాలకు సంబంధించి తన అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. శనివారం రాత్రి ఆయన తొలిప్రేమ సినిమా చూశానని ట్వీటర్‌ ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్.

ఇది కొందరు నెటిజన్లకు నచ్చలేదు. ఆ తరువాత కేటీఆర్‌ ట్విటర్‌లో తన ప్రొఫైల్‌ ఫొటోను మార్చుకున్నారు. నెటిజన్లు దీన్ని కూడా తప్పుబడుతున్నారు. దీనిపై ఆదివారం (ఫిబ్రవరి-11) ట్విట్టర్ లో స్పందించారు కేటీఆర్. తన ట్వీట్లపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు దీటుగా సమాధానమిచ్చారు కేటీఆర్. ‘నేను సినిమాలు చూస్తున్నానని, ప్రొఫైల్‌ పిక్చర్‌లు మారుస్తున్నానని ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వారందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఏదన్నా పనిచేసుకోండి. నేను మంత్రినే అయినా నాకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. మీకు నచ్చకపోతే నిరభ్యంతరంగా నన్ను ట్విటర్లో అన్‌ఫాలో అవ్వచ్చు’ అని ట్వీట్‌ చేశారు కేటీఆర్‌.

Posted in Uncategorized

Latest Updates