డప్పులతో టీమిండియాకి స్వాగతం

k2సౌత్ ఆఫ్రికాతో జరగనున్న ఐదో వన్డే కోసం పోర్ట్ ఎలిజబెత్ చేరుకుంది టీమిండియా. భారత ఆటగాళ్లు బస చేసే హోటల్ ప్రాంగణానికి చేరుకోగానే కళాకారులు సంప్రదాయ వేషధారణలో డ్రమ్స్‌తో కోహ్లీసేనకు ఘనస్వాగతం పలికారు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈనెల 13న సఫారీ జట్టుతో ఐదో వన్డే జరగనుంది. ఆరు వన్డేల సిరీస్‌లో వరసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ 3-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో వన్డేలో సౌత్ ఆఫ్రికా గెలుపొందగా మంగళవారం మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. 1992 నుంచి ఈ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో జ‌రిగిన నాలుగు మ్యాచ్‌ల్లో భార‌త్ ప‌రాజ‌యంపాలైంది.

Posted in Uncategorized

Latest Updates