డబుల్ ధమాక : రీఛార్జ్ పై జియో బంపర్ ఆఫర్

jioకొత్త ఆఫర్లతో టెలికం రంగంలోనే సంచలనం సృష్టించే జియో రిలయన్స్ మరో బంపర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ లపై ఎక్స్ ట్రా 1.5GB డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఎయిర్ టెల్ ఈ ఎక్స్ ట్రా డేటాను సెలక్ట్ చేసిన కస్టమర్లకు ఇస్తే, జీయో తన యూజర్లందరికీ ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచింది. మంగళవారం (జూన్-12) నుంచి జూన్‌ 30 వరకు ఈ ఆఫర్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్‌ ధమాకా ఆఫర్‌ తో పాటు, ఈ ఆపరేటర్‌ కొత్తగా రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌ ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్‌ చేసింది. ఈ కొత్త ప్యాక్‌ పై రోజుకు 3.5 GB డేటా అందించనున్నట్టు తెలిపింది.

జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌..

రోజుకు 1.5 GB డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 3GB డేటా పొందనున్నారు.

రోజుకు 2 GB డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5GB డేటా లభ్యం.

రోజుకు 3GB డేటా పొందే రూ.299 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5GB డేటా వస్తుంది.

రోజుకు 4GB డేటా పొందే రూ.509 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5GB డేటా లభ్యం.

రోజుకు 5GB డేటా పొందే రూ.799 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5GB డేటా పొందనున్నారు.

దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌ లపై జియో 100 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌ లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్‌ ల కోసం మైజియో యాప్‌, పేటీఎం వాడుతూ.. ఫోన్‌ పే వాలెట్‌ ద్వారానే రీఛార్జ్‌ చేయించుకోవాలని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates