డబుల్ బెడ్ రూం ఇళ్లకు బేస్ ధరకే స్టీల్

double-bed-roomరాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్ ను బేస్ ధరకు ఇవ్వడానికి కంపెనీలు అంగీకరించాయి. హైదరాబాద్ బేగంపేటలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్, లక్ష్మారెడ్డి స్టీల్ కంపెనీల యజమానులతో సమావేశమయ్యారు. పేదల కోసం భారీ సంఖ్యలో కట్టిస్తున్న ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు. దీంతో టన్ను స్టీలుపై 9వేల 440 రూపాయలు తగ్గించి 43వేల 660 రూపాయలకు సరఫరా చేయడానికి కంపెనీలు అంగీకరించాయి.

జిల్లాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి లక్షా 45 వేల టన్నులు, పట్టణాల్లో 60 వేల ఇళ్లకు లక్షా 4 వేల టన్నులు, GHMC పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి 2 లక్షల 78 వేల టన్నుల స్టీల్ అవసరమని అంచనా వేశారు. వీటి కోసం 2 నెల ల వరకు బేస్ రేటుకే అందించడానికి కంపెనీలు ఒప్పుకున్నాయి. డ బుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం మొదలుపెట్టిన టైంలో టన్ను స్టీలు ధర పన్నులతో కలిపి 32 వేల 550 రూపాయలు ఉండేది. ఇప్పుడు GSTతో కలిపి స్టీల్ ధ ర 53 వేల 100కు చేరింది. దీంతో ఇళ్ల నిర్మాణం భారంగా మారుతోందని బిల్డర్లు ప్రభుత్వం దృష్టికి తీస్కెళ్లారు. దీనిపై ఈమధ్యే కంపెనీలతో సమావేశమైన మంత్రులు రేటు తగ్గించాలని కోరారు. అందరూ కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటామని కంపెనీలు చెప్పాయి. ఇవాళ(శుక్రవారం-16) సమావేశంలో రేటు తగ్గించడానికి అంగీకరించాయి. టన్నుకు 9వేల 440 రూపాయల వరకు తగ్గించడంతో ఇళ్ల నిర్మాణంలో 264 కోట్ల వరకు భారం తగ్గనుందని అంచనా వేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates