డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు స్టీల్ ధరలు తగ్గించండి

ktr-indrakaranడబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు స్టీల్ ధరల తగ్గింపుపై… ఎనిమిది స్టీల్ కంపెనీల యజమానులతో సోమవారం (ఫిబ్రవరి-5) చర్చలు జరిపారు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి. 30 నుంచి 450 శాతం స్టీల్ ధరలు పెరుగటంతో కాంట్రాక్టర్లు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించలేమని చెప్పారు. దీంతో స్టీల్ కంపెనీల యజమానులతో చర్చించిన మంత్రులు…సామాజిక బాధ్యతగా తమవంతు సాయం చేయాలని కోరారు.

ఇండ్ల నిర్మాణానికి సిమెంట్ కంపెనీలు… మార్కెట్ తో సంబంధం లేకుండా బస్తా సిమెంట్ 230 రూపాయలకే అమ్ముతున్నారని… స్టీల్ కంపెనీ యాజమాన్యాలు కూడా తక్కువ ధరకే స్టీల్ ను  అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇండ్లకు ఒక లక్షా 45 వేల మెట్రిక్ టన్నులు, పట్టణ ప్రాంతాల్లో 60 వేల ఇండ్లకు లక్షా 4 వేల మెట్రిక్ టన్నుల స్టీల్ అవరం ఉందన్నారు. GHMC పరిధిలో లక్ష ఇండ్లకు రెండు లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల స్టీల్ కావాలని కంపెనీలకు తెలిపారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఆన్ లైన్ లో బిల్లుల చెల్లింపులు ఉంటాయన్నారు.

అన్ని కంపెనీలతో చర్చించిన తర్వాత సర్కార్ కు తమ నిర్ణయాన్ని చెబుతామన్నారు స్టీల్ కంపెనీల యజమాన్యాలు. నో ప్రాఫిట్…నో లాస్ తో గవర్నమెంట్ కు స్టీల్ సప్లై చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. స్టీల్ ధరలపై రేపు(మంగళవారం) మరోసారి స్పెషల్ సీఎస్ తో భేటీ అవుతామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు సామాజిక బాధ్యతగా వీలైనంత వరకు ధరలు తగ్గిస్తామంటున్నాయి స్టీల్ కంపెనీలు.

Posted in Uncategorized

Latest Updates