డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను తనిఖీ చేసిన కేటీఆర్

ktrజియాగూడలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తనిఖీ చేశారు మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్. ఇళ్ల లోపలికి వెళ్లి.. పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేటీఆర్ వెంట.. మేయర్ బొంతు రామ్మోహన్.. జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. పనుల్లో జాప్యం చేయకుండా.. అనుకున్న సమయానికి పూర్తి చేయాలని కోరారు కేటీఆర్. జియాగూడలో గతేడాది జులైలో డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates