డబ్బుకంటే చదువే ముఖ్యమైనది : గవర్నర్

విద్యార్థులకు డబ్బు కంటే చదువే ముఖ్యమన్నారు గవర్నర్ నరసింహన్. మంగళవారం (జూలై-31) హైదరాబాద్, అబిడ్స్ లోని లిటిల్ ప్లవర్ స్కూల్ లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..చదువు చెప్పే గురువులను, కనిపెంచిన తల్లిదండ్రులను ప్రతి ఒక్క విద్యార్థి గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానం చెప్పారు. తాను కూడా ఐదో తరగతి వరకు ఇదే స్కూల్‌లో చదువుకున్నానని గుర్తు చేశారు. ఇదే పాఠశాలలో చదువుకొని.. ఇప్పుడు గవర్నర్ హోదాలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. జీవితంలో తన అనుభవాలను తాను చదువుకున్న స్కూల్ విద్యార్థులతో పంచుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. జీవితంలో డబ్బులు ముఖ్యం కాదు, చదువు ముఖ్యమని గుర్తించాలన్నారు. ఆ దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని గవర్నర్ సూచన చేశారు.

Posted in Uncategorized

Latest Updates