డబ్బులు ఇవ్వలేదని యువతి ఆత్మహత్య

చిన్న, చిన్న కారణాలతోనే నేటి యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగిలిస్తున్నాయి. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన విజయవాడలోని సింగ్‌నగర్‌లో చోటు చేసుకుంది. సింగంపల్లి నిహారిక అనే యువతి బెంగళూరులో మల్టీమీడియా పూర్తి చేసింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో నగరంలోనే ఉంటోంది. శుక్రవారం(జూలై-13) రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు నిహారిక తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. అయితే అందుకు వారు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. నిహారిక తల్లి గవర్నర్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐ కాగ…, తండ్రి గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates