డబ్బు యంత్రాలం : సంపద సృష్టిలో ఆరో స్థానం

india-richధనిక దేశాల లిస్టులో భారత్‌కు ఆరో స్థానం దక్కింది. 8,230 బిలియన్‌ డాలర్ల సంపదతో భారత్‌ ఈ కీర్తి గడించింది. మారిషస్‌లోని AFR ఆసియా బ్యాంకు నివేదిక ఈ విషయం స్పష్టం చేస్తోంది. అమెరికాది ఫస్ట్ ప్లేస్. 2017లో అమెరికా 64వేల 584 బిలియన్‌ డాలర్ల సంపదతో ఉండగా.. చైనా 24వేల 803 బిలియన్‌ డాలర్లతో ఈ వెనకే ఉంది. 19వేల 522 బిలియన్‌ డాలర్ల సంపదతో జపాన్‌ థర్డ్ ప్లేస్ లో ఉంది. నగరంలో నివసిస్తున్న వ్యక్తుల ప్రైవేట్ ఆస్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నివేదిను రూపొందింది. నాలుగో స్థానంలో బ్రిటన్‌ 9వేల 919 బిలియన్‌ డాలర్లతో ఉంది. ఐదో స్థానంలో జర్మనీ 9వేల 660 బిలియన్ డాలర్లు కలిగి ఉంది. ఇక భారత్ 8వేల 230 బిలియన్‌ డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఏడో స్థానంలో ఫ్రాన్స్‌(6,649 బిలియన్‌ డాలర్లు), ఎనిమిదో స్థానంలో కెనడా(6,393 బిలియన్‌ డాలర్లు), తొమ్మిదో స్థానంలో ఆస్ట్రేలియా(6,142 బిలియన్‌ డాలర్లు), పదో స్థానంలో ఇటలీ( 4,276 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ పరంగా భారత్‌ తన సంపదలో వృద్ధిని నమోదు చేసుకుంటూ వస్తోంది. 2016లో మన దేశ సంపద 6వేల 584 బిలియన్‌ డాలర్లు ఉండగా.. ఈ ఏడాది 25 శాతం వృద్ధిని నమోదు చేసుకుని 8వేల 230 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2007 నుంచి 2017 వరకు భారత్‌ సంపద 160శాతం పెరిగింది. ఇక చైనా గతేడాదితో పోలిస్తే 22శాతం వృద్ధిని నమోదు చేసింది. మిలియనీర్ల జాబితాలో 20వేల 730 మంది మల్టీ మిలియనీర్లతో అంతర్జాతీయంగా భారత్‌ ఏడో స్థానంలో నిలిచింది. బిలియనీర్ల జాబితాలో అమెరికా, చైనా తర్వాత 119 మంది బిలియనీర్లతో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

Posted in Uncategorized

Latest Updates