డబ్లిన్: టీ-20 సిరీస్ భారత్  కైవసం

Lokesh-Rahulడ‌బ్లిన్‌లో భార‌త్ వ‌ర్సెస్ ఐర్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో 143 గప‌రుగుల తేడాతో ఐర్లాండ్‌పై భార‌త్ విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 213 ప‌రుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 36 బాల్స్ లో 3 ఫోర్లు, ఆరు సిక్సులతో  70 రన్స్ చేశాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన  రైనా 45 బాల్స్ లో ఐదు ఫోర్లు 3 సిక్సులతో 69 రన్స్ చేశాడు.

తర్వాత 214 ప‌రుగుల విజ‌య  లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జ‌ట్టు 12పాయింట్ 3 ఓవర్లలో ఐర్లాండ్ కేవలం 70 ప‌రుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 143 ప‌రుగుల తేడాతో ఐర్లాండ్‌పై భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భార‌త్ కైవ‌సం చేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates