డబ్ల్యూటీఓ నిబంధనలు ఉల్లంఘించలేదు

న్యూఢిల్లీ : ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనలపై చైనా అభ్యంతరాలను మనదేశం ఖండించింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు తేల్చిచెప్పింది. ఇది పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయమేనని వాణిజ్య పరంగా ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది. కరోనా సంక్షోభం కారణంగా విదేశీ సంస్థలు మన దేశంలోని సంస్థల్లో వాటాలు దక్కించుకోకుండా భారత్ ఇటీవల కొన్ని చర్యలు చేపట్టింది. ముఖ్యంగా భారత్ తో సరిహద్దు ఉన్న దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని నిబంధన తెచ్చింది. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది డబ్లూటీఓ నిబంధనల ఉల్లంఘనేని ఆరోపించింది. ఈ ఆరోపణలకు భారత్ సమాధానం ఇచ్చింది. డబ్ల్యూటీఓ కింద వివిధ ఒప్పందాలను ప్రభుత్వ చర్య ఎలా ప్రభావితం చేస్తుందనే అంచనాలను వెల్లడించింది. ఈక్విటీ క్యాప్, పరిమితులకు ఇది ఏ విధంగా నష్టం చేయదని తెలిపింది.

Latest Updates