డమ్మీనే కానీ.. దడ పుట్టించింది : కంగారు పెట్టిన పెద్ద పులి బొమ్మ

puliరాత్రి పూట సెక్యూరిటీ చేస్తున్న ఓ పోలీసు టీం వణికిపోయింది. 45 నిమిషాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. దీనికి కారణం ఓ పులి. నిజం పులి అయితే ఓకే.. కానీ అది బొమ్మ. స్కాట్ లాండ్ దేశంలో అబెర్డీన్‌షైర్‌ పట్టణం.. నార్త్ ఈస్ట్ పోలీస్ డివిజన్‌ కు శనివారం (ఫిబ్రవరి 3) అర్థరాత్రి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ప్రమాదంలో ఉన్నానని, తన పొలంలోకి పెద్దపులి వచ్చిందని చెప్పాడు. వెంటనే వచ్చి రక్షించాలని బాధితుడి వేడుకున్నాడు. కంగారుపడిన పోలీసులు.. హుటాహుటిన పొలం దగ్గరకు వెళ్లారు. రోడ్డుపై పడుకున్న పులిని చూశారు పోలీసులు. దగ్గరగా చూసిన అధికారులు భయంతో వణికిపోయారు. అలా 45 నిమిషాలు పులి వైపు వెళ్లకుండా బిగుసుకుపోయారు. 45 నిమిషాల తర్వాత పోలీసులకు ఓ డౌట్ వచ్చింది.

గంటసేపు పులి ఎందుకు కదలకుండా ఉంది.. పులికి ఏమైనా గాయం అయ్యిందా లేక చనిపోయి పడి ఉందా అని. అప్పుడు కొంచెం ధైర్యం చేశారు. అప్పటికీ భయం భయంగానే దానివైపు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లారు. అయినా కదల్లేదు. ఇంకొంచెం ధైర్యం చేసి.. దగ్గరగా వెళ్లారు. అప్పటికి గానీ రిలాక్స్ కాలేదు. అది పెద్దపులే.. కాకపోతే బొమ్మ. కావాలనే ఇలా రోడ్డుపై పులి బొమ్మను పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని తెలిసి అధికారులకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఈ ఘటనను నార్త్ ఈస్ట్ డివిజన్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. పొలంలో ఉన్న బొమ్మను చూసి నిజమైన పులి అనుకుని రైతు చాలా భయపడిపోయాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇంకా భయపడ్డారు అనుకోండి..

Posted in Uncategorized

Latest Updates