డాక్టరేట్ అందుకున్న శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. క్రిస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ ఇటీవల శ్రీనివాస్ గౌడ్ కు గౌరవ డాక్టరేట్‌ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు ఆదివారం ఉదయం 10గంటలకు అమీర్‌పేట్‌ లోని సితార ఆడిటోరియంలో ఆయనకు డాక్టరేట్‌ ప్రదానం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం సహా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని డాక్టరేట్‌ ను ప్రదానం చేసినట్లు తెలిపారు యూనివర్సిటీ వీసీ శోభన్‌ బాబు. డాక్టరేట్ రావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్.

Posted in Uncategorized

Latest Updates