డాక్టర్ల నిర్లక్ష్యం : పసికందును పీక్కుతున్న ఎలుకలు

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతదేహాన్ని ఎలుకలు పీక్కు తిన్నాయి. ఈ దారుణ సంఘటన బుధవారం (జూలై-11) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లోని CKM హస్పిటల్ లో జరిగింది. డోర్నకల్ మండలానికి కి చెందిన శాంతి అనే మహిళ ప్రభుత్వ (CKM) ఆసుపత్రిలో ప్రసవించింది. అయితే.. దురదృష్టవశాత్తు పుట్టిన పసికందు వెంటనే చనిపోవడంతో.. ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందును డబ్బపెట్టెలో పెట్టారు. దీంతో ఎలుకలు ఆ పసికందును పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై పసికందు బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates