డాక్టర్ గా కలెక్టర్: పరీక్షించి మందులు రాసి ఇచ్చారు

doctor

అదో సర్కార్ దవాఖానా. రోగులతో రద్దీగా ఉంది. అదే సమయంలో జిల్లా కలెక్టర్ వచ్చారు. డాక్టర్ లేకపోవటంతో అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ చేసి ఎంక్వయిరీతో టైం వేస్ట్ అనుకున్నారో ఏమో.. వెంటనే డాక్టర్ సీట్లో కూర్చున్నారు. పేషంట్లు ఒక్కొక్కరినీ పిలిచి వైద్య పరీక్షలు చేశారు. మందులు రాసి ఇచ్చారు. అందరూ షాక్.. కలెక్టర్ ఏంటీ.. డాక్టర్ డ్యూటీ చేయటం ఏంటీ.. ఆయనకు అసలు వైద్యం వచ్చా.. రోగం గురించి తెలుసా అని.. ఈయన కలెక్టర్ కాకముందు డాక్టర్. సో.. డోంట్ వర్రీ. ఇది జరిగింది నల్గొండ టౌన్. వైద్యం చేసిన కలెక్టర్ గౌరవ ఉప్పల్. వివరాల్లోకి వెళితే..

నల్గొండ టౌన్ లోని పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ గౌరవ ఉప్పల్. పానగల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న కలెక్టర్.. అక్కడే ఉన్న హెల్త్ సెంటర్ ని ఆకస్మికంగా సందర్శించారు. హెల్త్ సెంటర్ లో అప్పటికే డాక్టర్ కోసం ఎదురుచూస్తున్న రోగులు బారులు తీరారు. సీన్ అర్థం అయ్యింది. తనే స్వయంగా పరీక్షలు చేసి మందులు రాసి ఇచ్చారు. గౌరవ ఉప్పల్ ఐఏఎస్ కాకా ముందు.. డాక్టర్. దీంతో రోగులను పరీక్షించారు. అక్కడ విధులు నిర్వహించాల్సిన డాక్టర్ శ్రీదేవి లేకపోవడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని DMHOను ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates