డాట‌రాఫ్ చాయ్ వాలా: ౩.8 కోట్ల స్కాలర్ షిప్ సొంతం

SUDEEKSHAపట్టుదల తో అమెరికా లోని  బాబ్సన్ కాలేజీలో సీట్ సాధించిన విద్యార్ధిని ఓ  చాయ్ వాలా కూతురు. కాలేజీలో అడ్మిషన్ తో పాటు ౩.8 కోట్ల స్కాలర్ షిప్ ను సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బులందషహర్‌కు చెందిన సుదీక్ష భాటి తండ్రి ఓ చాయ్ వాలా. చిన్నపాటి నుండి తండ్రి పడుతున్న కష్టాలను చూసిన సుదీక్ష పట్టుదలతో చదువుకుంది. CBSC ప్లస్‌టూ పరీక్షల్లో 98 శాతం మార్కులు తెచ్చుకొని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. అమెరికా లోని మస్సాచుసెట్స్ లోని బాబ్సన్ కాలేజీ లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సుదీక్ష కు అడ్మిషన్ తో పాటు రూ.3.8 కోట్ల స్కాలర్‌షిప్ వచ్చింది . కేవలం చదువులోనే కాదు సామాజిక కార్యకలాపాల్లో కూడా సుదీక్షా భాటీ ముందు వరుసలో ఉంటుంది. ఆడపిల్లల వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థలో ఉంటూ ఆడపిల్లలను చదివించాలని ఉద్యమిస్తోన్న సుదీక్షా భాటీ ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది. పేదరికం కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్న సుదీక్ష ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగుతానంటోంది.

అమెరికాలో చదవాలనే  కల సాకారమయ్యిందని తెలిపింది. ఈ విజయం నాకే కాకుండా  నా కుటుంబానికీ, నేను చదువుకున్న స్కూల్ కు పేరుప్రతిష్టలు సమకూర్చడం సంతోషాన్నిచ్చిందని తెలిపింది సుదీక్ష. మరింత పట్టుదలతో నా గమ్యం వైపు పయనిస్తానని చెప్పింది.

అమెరికాలోని ప్రతిష్టాత్మక బాబ్సన్ కాలేజీలో చదివే అవకాశం ఆ చాయ్ వాలా బిడ్డ ను వరించింది.. చదువుకునేందుకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ సుధీక్షా భాటీ కి వచ్చింది..  ఒక్కో సెమిస్టర్‌కి 70,428 అమెరికన్‌ డాలర్లు,  నాలుగేళ్ళ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుకి మొత్తం 3 కోట్ల 83 లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ సొంతం చేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates