డిగ్రీ అడ్మిషన్లు : ఒక్క సీటుకు 4 వేల మంది పోటీ

DEGREE SEATSహైదరాబాద్ లోని కోఠి ఉమెన్స్ కాలేజీకి డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల కోసం నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్ లైన్ సిస్టం ఆఫ్ తెలంగాణ (దోస్త్) కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆన్ లైన్ అడ్మిషన్ల క్రమంలో రాష్ట్రంలోని కాలేజీ సీట్లను సెలక్ట్ చేసుకోవడంలో..ఈ ఏడాది కూడా కోఠి ఉమెన్స్ కాలేజీలో సైన్స్ కోర్సులకు భారీ డిమాండ్ పెరిగింది. సైన్స్ కోర్సులోని ఒక్కసీటుకు 4వేల మంది పోటీపడ్డారని చెప్పారు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి. నిజాం కాలేజీలో సైన్స్‌ కోర్సులకు 30 సీట్లకు  వేల మంది పోటీపడ్డారన్నారు. ప్రభుత్వానికి చెందిన నాణ్యమైన కాలేజీల్లో డిగ్రీ చదువుకోవడానికి విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు.

సోమవారం (జూన్-4) దోస్త్ ద్వారా తొలి విడుత సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆన్‌ లైన్ ద్వారా రిపోర్టు చేసే అవకాశం కల్పించినట్టు తెలిపారు. దీనివల్ల స్లెడింగ్ లేదా ఇతర గ్రూపుల్లో తిరిగి సీట్లు పొందడానికి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. నచ్చిన కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్‌ ను ఖరారు చేసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్ గా ఆ కళాశాలలో ఫీజు చెల్లించాలని సూచించారు.

 

Posted in Uncategorized

Latest Updates