డిగ్రీ ఉంటే చాలు : న్యూ ఇండియా అస్యూరెన్స్‌ లో 685 ఉద్యోగాలు

NEW INDIA JOBSముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ ప్రదేశాలు/ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీల సంఖ్య -685
-పోస్టు పేరు : అసిస్టెంట్
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
-వయస్సు: 2018 జూన్ 30 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. SC/ST లకు ఐదేండ్లు, ఓబీసీలు మూడేండ్లు, PHC అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
-పే స్కేల్: రూ.14 వేల,435-40,080/-మెట్రోపాలిటన్ నగరాల్లో నెలకు రూ. 23,500/- జీతం ఉంటుంది. వీటికి తోడు ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం మరికొన్ని అలవెన్స్‌లు ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
-ఎంపిక విధానం: ఆన్‌ లైన్ రాతపరీక్ష
-దీనిలో ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌ లైన్‌ లో
-దరఖాస్తులు ప్రారంభం: జూలై 16
-చివరితేదీ: జూలై 31
-ప్రిలిమినరీ ఎగ్జామ్: సెప్టెంబర్ 8, 9
-మెయిన్ ఎగ్జామ్: అక్టోబర్ 6
-వెబ్‌సైట్: www.newindia.co.in
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (టైర్ 1):100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-ఈ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 మార్కులు) అంశాలపైన ప్రశ్నలు ఇస్తారు.
-మెయిన్ ఎగ్జామినేషన్ (టైర్ 2): 250 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి120 నిమిషాలు.
-ఈ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌ నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపైన పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు-ఒక్కొక్క విభాగానికి 50 మార్కులు కేటాయించారు.

Posted in Uncategorized

Latest Updates