డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

telanagan logoతెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 115 డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాలేజీ ప్రిన్సిపల్స్ 15, డిగ్రీ లెక్చరర్లు 1,214, ఫిజికల్ డైరెక్టర్లు 67, లైబ్రైరియన్ 64, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 24 పోస్టులు మంజూరు చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 199 లెక్చరర్ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2008కి పూర్వం ప్రారంభించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 374 పోస్టులు, 2008 తర్వాత ప్రారంభించిన 57 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,010 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates