డిజిటల్ ఇండియాతో దళారుల వ్యవస్థకు చెక్ : మోడీ

MODIదళారుల వ్యవస్థ లేకుండా చేసేందుకే డిజిటల్ ఇండియా స్కీమ్ అమలుచేస్తున్నామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. డిజిటల్ ఇండియా లబ్దిదారులతో ఆయన వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానపు ప్రయోజనాలు సమాజంలో అన్ని వర్గాలకు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మోడీ. గ్రామీణ భారతంలో డిజిటల్ ఇండియా చాలా మార్పులు తీసుకొస్తోందన్నారు.

బ్లాక్ మనీ తగ్గి.. కరెన్సీకి సెక్యూరిటీ పెరుగుతుందన్నారు. బ్యాంకు అకౌంట్లు అందరి చేతికి రావడంతో నగదు బదిలీ ఈజీ అయిందన్నారు. రైల్వే టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటున్నారనీ.. బిల్లులు ఆన్ లైన్ లో కట్టే వీలు కలిగిందన్నారు ప్రధాని.

Posted in Uncategorized

Latest Updates