డిజిటల్ పేమెంట్స్ కు ఊతం.. బంగారం బాండ్లపై రూ.50 తగ్గింపు

ఢిల్లీ : డిజిటల్ పేమెంట్స్ కు మరింత ప్రోత్సాహం అందించేందుకు బంగారం బాండ్లపై స్పెషల్ డిస్కౌంట్ ను ప్రకటిచింది కేంద్రప్రభుత్వం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. బంగారం బాండ్లపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ఇన్వెస్టర్లు… ఆన్ లైన్ లో అప్లై చేసి.. డిజిటల్ మోడ్ లో పేమెంట్స్ చేస్తే… ప్రతి గ్రామ్ బంగారం ఇష్యూ ప్రైస్ పై యాభై రూపాయల డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. అలాంటి ఇన్వెస్టర్లందరికీ… ప్రతి గ్రాముకు రూ.3వేల 96 ధరతోనే గోల్డ్ బాండ్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates