డిజిలాకర్‌ యాప్‌ : రైల్లో ప్రయాణికులకు.. ఒరిజినల్స్ ఐడీ ప్రూఫ్స్ అక్కర్లేదు

TC RAILWAYప్రయాణికులకు రైల్వే కాస్త ఊరట కలిగించే న్యూస్ చెప్పింది.  రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఐడీ ప్రూఫ్ గా ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పట్నుంచీ ఐడీ ప్రూఫ్స్ ఒరిజినల్స్ చూపించాల్సిన అవసరంలేదని తెలిపింది రైల్వే. ఐడీ ప్రూఫ్‌ గా ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు బదులు వాటి సాఫ్ట్‌ కాపీలు చూపిస్తే సరిపోతుందని గురువారం (జూలై-5) వెల్లడించారు రైల్వే అధికారులు.

ప్రయాణికుల కోసం ఇటీవల డిజిలాకర్‌ యాప్‌ సర్వీసును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  డిజిలాకర్‌ లో సేవ్‌ చేసి పెట్టుకున్న ఐడీ ప్రూఫ్ లను టీసీ అధికారులకు చూపించవచ్చని తెలిపారు. ఇందులోని డిజిటల్‌ స్టోరేజీలో ప్రయాణికులు తమ అధికారిక పత్రాలను క్లౌడ్‌ లో భద్రపరుచుకోవచ్చని వివరించారు. రైలు ప్రయాణాల్లోనూ డిజిలాకర్‌ లో భద్రపరుచుకున్న ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ల సాఫ్ట్‌ కాపీలను గుర్తింపు కార్డులుగా పరిగణించాలని ఆదేశిస్తూ.. అన్ని రైల్వే జోనల్స్‌ లోని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్లకు మెసేజ్ పంపించారు. ప్రధాని  మోడీ డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డిజిలాకర్‌ ను ప్రవేశపెట్టారు. డిజిలాకర్‌ లో సబ్‌ స్క్రైబర్లు తమ పాన్‌ నెంబరునూ చేర్చుకోవచ్చు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates