డిజైన్స్ ఖరారు : అమరవీరుల కొత్త స్మారక స్థూపం

martyrs-memorial-design-Telangnaతెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం  చేసిన అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకాన్ని నిర్మించనున్నది ప్రభుత్వం.  వందలాది మంది ప్రాణ త్యాగం చేశారు. ఆ అమరవీరుల కోసం హుసేన్ సాగర్ దగ్గర.. ప్రత్యేక స్మారకాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఈ ఫోటోలను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్.

స్మారకాన్ని దీపం రూపంలో డిజైన్  చేశారు. అమరులకు నిరంతరం నివాళి అర్పిస్తున్నట్లుగా ఉండే విధంగా రూపొందించారు. తెలంగాణ అమరుల స్మారకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఆ స్మారకం దగ్గర విజిటర్స్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కల్పించనున్నారు. మ్యూజియం, ఆడియో విజువల్ హాల్, సమావేశాల కోసం కన్వెన్షన్ హాల్, విజిటర్స్ కోసం ఓ రెస్టారెంట్ వసతులు కూడా ఉండనున్నాయి. స్మారకం డిజైన్ కట్టడంలో గ్రౌండ్ లెవల్ తో పాటు మూడు అంతస్తులు ఉండనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates